Oct 30,2023 11:25

న్యూఢిల్లీ : అమ్మకానికి ఉద్దేశించిన ఆహార, పానీయాల కల్తీ విషయంలో పార్లమెంటరీ ప్యానెల్‌ కీలక సిఫారసులు చేసింది. భారతీయ న్యాయ సంహిత బిల్‌ (బీఎన్‌ఎస్‌) కింద తప్పనిసరిగా జైలు శిక్షను విధించాలనీ, ఐదు రెట్లు జరిమానాను పెంచాలని ప్రతిపాదించింది. కల్తీ విషయంలో కనీసం ఆరు నెలల జైలు శిక్ష, గరిష్టంగా రూ. 25 వేల జరిమానాను విధించాలని వివరించింది. ఆగస్టులో ప్రవేశపెట్టబడిన బీఎన్‌ఎస్‌ బిల్‌.. కల్తీ చేయబడిన ఆహార, పానీయాల అమ్మకాల విషయంలో ఆరునెలల వరకు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానాను ప్రతిపాదించిన విషయం విదితమే.