Jul 24,2023 15:42

జెరూసలెం :   ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ, ప్రతిపక్షాల మధ్య తుది చర్చలపై అత్యవసర పరిస్థితి నెలకొన్నట్లు ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ పేర్కొన్నారు. న్యాయసంస్కరణల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆదివారం రాత్రి వేలాది మంది ఆందోళనకారులు టెల్‌ అవీవ్‌ నుండి జెరూసలెం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, నెతన్యాహూ ప్రభుత్వ నిరంకుశత్వానికి అడ్డూ అదుపు ఉండదని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యాయ సంస్కరణల బిల్లుపై ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ, ప్రతిపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు హెర్జోగ్‌ యత్నిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి వరకు చర్చలు కొనసాగినట్లు ఆయన  తెలిపారు. విభజన మార్పులపై ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ లేదా నెసెట్‌ను తొందరపడవద్దని అమెరికా కోరింది. దీంతో అమెరికా నుండి వచ్చిన ఐజాక్‌ నెతన్యాహూని కలిసేందుకు నేరుగా షెబా మెడికల్‌ సెంటర్‌కు వెళ్లారు. అనంతరం ప్రతిపక్షాలతోనూ సమావేశమయ్యారు. 

అత్యవసర హార్ట్‌ సర్జరీ కోసం నెతన్యాహూ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన ఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు.
న్యాయ సంస్కరణ ముసాయిదా బిల్లుపై నేడు నెసెట్‌లో తుది ఓటింగ్‌ జరగనుంది. తాను అద్భుతంగా పనిచేస్తున్నానని, ఓటింగ్‌లో పాల్గొనననున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు.