'చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కన్నా. అందరి కష్టాలలాగే నావి కూడా. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. నటిగా ఎంపిక చేయడం, కారణం లేకుండా తిరస్కరించడం ఇలా ఎన్నో అవమానాలు ఎదురయ్యా యి. ఆడిషన్స్ కోసం క్యూ లైన్స్‌లో నిలబడటం, ఆఫర్స్ కోసం ఫోన్లు చేయడం.. ఇలాంటి ఎన్నో అనుభవాలు చూశా. ధైర్యం, నమ్మకంతో ప్రతి సమస్యను ఎదుర్కొన్నాను. కఠోర శ్రమతో లక్ష్యాన్ని సాధించాను. ఈ ప్రయాణంలో ప్రతీది ఒక అందమైన పాఠాన్ని నేర్పించింది. కుటుంబం తోడుగా ఉండటంతోనే ఈ స్థాయికి రాగలిగాను' అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నటి భూమీ ఫడ్నేకర్‌తో ఆమె 'థ్యాంక్యూ ఫర్ కమింగ్' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా భూమీ తన సినీ కెరీర్ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేసి రకుల్‌ని ట్యాగ్ చేశారు. దీంతో రకుల్ తన సినీ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.










