Sep 19,2023 10:53
  • డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 16, 48 డివిజన్లలో రూ.40 లక్షలతో అభివృద్ధి పనులను మంగళవారం నాడు డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రార్బించారు. నగరంలోని 16, 48 డివిజన్ల పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం నిధులతో గుర్తించిన పలు అభివృద్ధి పనులకు.శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వాటిని త్వరిత గతిన పూర్తి చేసి ప్తార్బించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.40 లక్షల వ్యయంతో రహదారులు, కాలువల నిర్మాణం  మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమాల్లో జోనల్ ఇన్చార్జి ఆశపు వేణు, కార్పొరేటర్లు గుజ్జల నారాయణరావు, నడిపిల్లి ఆదినారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.