Oct 20,2023 15:37

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ :  శుక్రవారం రాజంపేట నియోజకవర్గంలో ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట మునిసిపాలిటీలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అనేక దశాబ్దాలుగా 16 వ వార్డు సుద్ధ గుంతలు ప్రాంతంలో వర్షం కురిస్తే నీళ్ళు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతుండే వారని, అందువల్ల రోడ్డు నిర్మించడం తో సమస్య పరిష్కారం అయిందని తెలిపారు. అలాగే ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా బలిజపల్లి వద్ద హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఆరోగ్య కేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు  పాల్గొన్నారు.