ప్రజాశక్తి - పెనుమంట్ర : దాట్ల వారసత్వాన్ని కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది కొనసాగించడం అభినందనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఎస్ఆర్ దాట్ల 44వ వర్ధంతి సందర్భంగా సోమవారం బ్రాహ్మణ చెరువు చింతపల్లి శ్రీరాములు స్మారక బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన దాట్ల వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ చెందిన బయలాజికల్ ఈ లిమిటెడ్ వారి సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముందుగా ఎస్ ఆర్ దాట్ల, భార్య సూర్యవతి , విజయ్ కుమార్ దాట్ల, చింతపల్లి శ్రీరాములు చిత్రపటాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీతమ్మ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్, పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, జడ్పిటిసి కర్రి గౌరీ సుభాషిణి, మార్టేరు ఉపసర్పంచి కర్రీ వేణు బాబు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కేతా పద్మజ తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చింతపల్లి శ్రీరాములు స్మారక బస్సు స్టాండ్ నుండి పెనుమంట్ర ఎస్ ఆర్ దాట్ల స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అన్నారు. ప్రస్తుతం విద్య ఆరోగ్యం కోసమే కుటుంబం అప్పుల పాలవడం, ఆత్మహత్యలు జరగడం, దివాలా తీయడం జరుగుతున్నాయి అన్నారు. ఈరోజు అందరికీ విద్య వైద్య ప్రాథమిక హక్కుగా ఉండాలన్నారు. ఇటీవల కాలంలో రాజస్థాన్ లో ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చాడు. అంతకుముందు కేరళలో అత్యంత ప్రాధాన్యత గల రంగంగా వైద్యం ఉందన్నారు . పిల్లల ఆరోగ్య విషయంలో గాని, తల్లి ఆరోగ్యం లాగానే, వీటన్నిటిలోని ప్రసూతి మరణాలలో ఐక్యరాజ్యసమితి ప్రమాణాల్లో కేరళలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. దానికి కారణం ప్రజాసేవ లక్ష్యంగా ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వ అధికారంలో ఉండడం ప్రధాన కారణం అన్నారు. వైద్యాన్ని ఒక వ్యాపారంగా కాకుండా, సేవా కార్యక్రమం కింద భావించటం వల్ల అది సాధ్యమైంది అన్నారు. ప్రస్తుతం వైద్యం సేవల కాకుండా వ్యాపారంగా సాగుతుందని అన్నారు. మందులు , ఫీజులు , ఆపరేషన్ , పరీక్షలు అన్నీ కూడా విపరీతమైన ఖర్చుతో కూడుకున్నయన్నారు. వాతావరణ మార్పులు వలన వచ్చే సీజనల్ వ్యాధులు కూడా వేల రూపాయలకు చేసే పరిస్థితి నెలకొందన్నారు. ఎస్ ఆర్ దాట్ల స్ఫూర్తితో ప్రతి ఏడాది క్యాంపులు పెట్టి సేవ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇటువంటి సేవ కార్యక్రమం చేయడం ప్రభుత్వ హక్కుగా గుర్తించాలని అన్నారు. అత్తిలి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆదరాభిమానాలు కలిగిన నాయకుడిగా ఎస్ ఆర్ దాట్ల అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ రావు కొనియాడారు. అత్తిలి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆదరాభిమానాలు కలిగిన నాయకుడిగా ఎస్ ఆర్ దాట్ల ఉన్నారన్నారు. కల్లుగీత కార్మికులందరినీ ఏకం చేసి సంఘాన్ని నిర్మించిన వ్యవస్థాపకులు అని కొనియాడారు . కల్లుగీత కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి వారి హక్కుల కోసం, సమస్యలు పరిష్కారం కోసం విశేష కృషి చేశారన్నారు. వారి ఆశయాల బాటలోనే ఇప్పటికీ ఎందరో ఆయన బాటలో నడుస్తున్నారన్నారు. ఇప్పటికీ కల్లుగీత కార్మికుల సరైన ఆదరణ, సరైన పథకాలు, స్కీములు లేవన్నారు. ప్రస్తుతం కులాల వారి, వృత్తుల వారి, అనేక కార్పొరేషన్లు వచ్చాయని అన్నారు. కానీ వృత్తులు చేసే వారికి ఎలాంటి పథకాలు, విధులు మంజూరు చేయటం గాని లేవన్నారు. పూర్తిగా చేతి వృత్తులు నిరాదరణకు గురయ్యాయి అన్నారు. కుటుంబాలు ఆర్థికంగా చిరిగిపోయి, కుదేలు అయిపోతున్నాయి అన్నారు. గ్రామాలలో అదే వృత్తిలో కొనసాగలేక, వేరే వృత్తిలో బతకలేక శాతమతమవుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కార్పొరేషన్ పెట్టి పదవులు ఇచ్చింది తప్ప పథకాలు కరువయ్యాయని అన్నారు. చేతివృత్తుల వారికి సమగ్రమైన చట్టం తెస్తే తప్ప వృత్తుల రక్షణ సాధ్యం కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాల వలన చేతివృత్తులన్నీ కనుమరుగవుతున్నాయని అన్నారు. ఆస్తులు అన్ని చదివించిన, ఉద్యోగాలు లేని పరిస్థితి నెలకొంది అన్నారు. జయహో బిసి గర్జన వంటి వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదు అని అన్నారు. కులాలు పేరు చెప్పి ఓట్లు దండుకోవడం కోసం సోపానాలుగా వీటిని మార్చుకోవడం జరుగుతుందన్నారు. మోడీ తను బీసీలను చెప్పుకుంటూ దేశంలో వెనుకబడిన తరగతులు కులాలు వారిపై జరుగుతున్న అజయిత్యాలు, మహిళలపై జరుగుతున్న దాడులు హత్యాచారాలు, నోరు కదపడం లేదన్నారు. మణిపూర్ లో జరుగుతున్న హింసపై పార్లమెంటులో చర్చకు తావివ్వడం లేదని అన్నారు. ఇటువంటి చేతగాని ప్రధాని మన దేశానికి ఉండడం దేశ ప్రజలందరూగా సిగ్గుపడాలి విషయం అన్నారు.2002 గుజరాత్ మారణహోమం మించి ఇప్పుడు మణిపూర్ లో జరుగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ ఆర్ దాట్ల వంటి యోధుడి జీవితం ఆదర్శంగా నిలవాలన్నారు. ఎస్ఆర్ దాట్ల కాకలు తీరిన కమ్యూనిస్టు అన్నారు. అత్తిలి నియోజకవర్గంలో ప్రజాభిమానాలు పొందిన శాసనసభ్యుడిగా, ప్రజానాయకుడిగా ఇప్పటికే అందరి మదిలి నిలిచాడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఏఏ వృత్తిలో వ్యాపారాల్లో ఉన్నప్పటికీ వామపక్ష ఉద్యమాలకు అండగా ఉన్నారన్నారు. ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల అధ్యక్షుడు కూసంపూడి సుబ్బరాజు , సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు బత్తుల విజయ్ కుమార్, చింతపల్లి లక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు.










