
ప్రజాశక్తి-పార్వతీపురం : అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపియం ఆధ్వర్యాన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 30న పార్వతీపురం జిల్లా సీతంపేట వద్ద నుండి ఏజెన్సీ జాతా పేరుతో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్వతీపురం జిల్లాలో సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు బస్సులను సిద్ధం చేస్తున్నారు.


