ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ : మంగళగిరి మండలం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ముసలి పకీరయ్య సతీమణి, మంగళగిరి మండల సిపిఎం పార్టీ కార్యదర్శి ముసలి జ్యోతిబాసు తల్లి గారైన ఆత్మకూరు గ్రామ మహిళా సంఘం నాయకులు కామ్రేడ్ ముసలి శివమ్మ (72) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. వారి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. శివమ్మ భౌతికకాయంపై సీపీఎం, ఐద్వా జెండా లను కప్పి నివాళులు అర్పించారు. సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్ బాబురావు, ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎస్ ఎస్ చెంగయ్య, మున్సిపల్ వర్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సీపీఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, జొన్న శివశంకర్, కాట్రగడ్డ శివరామ కృష్ణయ్య, సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి, దుగ్గిరాల మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వల్లభనేని సాంబశివరావు, బి.కోటేశ్వరి, డి.శ్రీనివాస కుమారి, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. బాల కృష్ణ, సీపీఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా శివ దర్గారావు, సహాయ కార్యదర్శి డోకిపర్తి రామారావు, క్షౌర వృత్తిదారుల సంఘ జిల్లా కన్వీనర్ మున్నంగి చలపతిరావు, ఎం.బాలాజీ, ఎం. భాగ్యరాజు, కాజా వెంకటేశ్వర రావు, సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి తాడేపల్లి కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి, విశ్వశాంతి విద్యాసంస్థల డైరెక్టర్ క్రిష్ణ మాస్టారు, ప్రముఖ అడ్వకేట్ లు కె.వి ప్రసాద్, వాకా రాంగోపాల్ గౌడ్, సీపీఎం నాయకులు వీసం జవహర్ లాల్, వీసం వెంకటేశ్వరరావు, వీసం ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈదా ప్రతాపరెడ్డి, తమ్మా ప్రసాదరెడ్డి, ఆళ్ల సాంబిరెడ్డి, అదిశేఖర్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పండల ప్రసాద్, సీపీఎం గ్రామ శాఖా కార్యదర్శి యు. దుర్గారావు, సోలా ముత్యాలరావు, వైసిపి నాయకులు బొమ్ము శివ రామిరెడ్డి, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, జంగాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు










