Jul 24,2023 22:16

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా) : వాన్‌పిక్‌ పేరుతో సేకరించిన భూములను తిరిగి రైతులకు, వాస్తవ సాగుదారులకు వెనక్కి ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. వేటపాలెం, చినుగంజాం మండలాల్లో వాన్‌పిక్‌ కోసం సేకరించిన భూములను సోమవారం ఆయన పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం చీరాలలోని సిపిఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2008లో పేద రైతుల నుండి 26 వేల ఎకరాలను వాన్‌పిక్‌ కోసం బలవంతంగా తీసుకును విషయానిు ఆయన గుర్తుచేశారు. 15 సంవత్సరాల కాలంలో పరిశ్రమ ఏర్పాటుంలో ఏ మాత్రం పురోగతిలేనందున భూములను తక్షణం రైతులకు వెనక్కి ఇవ్వడంతో పాటు, వాటిపై హక్కులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరారు. రైతులను మోసం చేసి, వారు భారీగా నష్టపోవడానికి కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సమైక్య రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూములపై వేసిన మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సులను వి. శ్రీనివాసరావు గుర్తుచేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో విఫలమైనందున ఈ రెండిటి కోసం సేకరించిన భూములను రైతులకు ఇవ్వాలని ఉపసంఘం సిఫార్సు చేసిందని చెప్పారు. ఇడి కేసులునుందున వాన్‌పిక్‌ విషయంలో ఏం చేయలేకపోతున్నామని అప్పట్లో టిడిపి ప్రభుత్వం చెప్పిందని అన్నారు. బాధితులుగా మిగిలిన రైతులకు న్యాయం చేసేందుకు టిడిపి ప్రభుత్వంగానీ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వంగానీ చేసిందేమి లేదని అన్నారు. ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఇడి కేసుల నుండి వాన్‌పిక్‌ భూములను విడుదల చేసిందని, ఇకనైన రైతులకు పూర్తి హక్కులతో భూములను వెనక్కి ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. భూ సేకరణ సమయంలో ప్రభుత్వంతోపాటు, కంపెనీ కూడా రైతులకు అనేక హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపారని అన్నారు. ఈ 15 ఏళ్ల కాలంలో ఆ హామీలను అమలు చేయకపోవడంతో పాటు, పొలాలకు రైతులను దూరంగా పెట్టడం, మత్య్సకారులను వేటకు నిషేధించడం వంటి చర్యల కారణంగా వేల కోట్ల రూపాయలు స్థానికులు నష్టపోయారని తెలిపారు. వాన్‌పిక్‌ భూ సేకరణను ఈ శతాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. పట్టా భూమికి ఒక రేటు, పట్టాలేని భూమికి మరో రేటు ఇచ్చారని అన్నారు. భూములిచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామనిఆ రోజు వాగ్దానం చేశారనిగుర్తు చేశారు. ఈ భూములను నిమ్మగడ్డ ప్రసాద్‌ బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.860 కోట్లు తీసుకున్నారని తెలిపారు. వాడరేవు-నిజాంపటుం కారిడార్‌ పేరుతో అభివృద్ధి చేస్తామని, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. భూెమలను వెనక్కివ్వడంతో పాటు, రైతులకిచ్చిన హామీలు అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.

  • ఇంటి పక్క గ్రామానికీ హెలికాప్టర్‌లోనా?

తన ఇంటికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరానికి కూడా సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్లడం హాస్యాస్పదంగా ఉందనివి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల్లో తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌ ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశిుంచారు. ప్రజల నిరసన ఎదుర్కొనే ధైర్యంలేక దొడ్డిదార్లు వెతుక్కునివెళ్లడం ఏమిటన్నారు. సిఎం పర్యటన అంటే పరదాలు కట్టుకుని వెళ్లాల్సిన పని ఏమిటని, ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న చెట్లను నరకడం ఏమిటని ప్రశిుంచారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇన్ని తిప్పలు పడుతున్న ముఖ్యమంత్రి రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలను ఓట్లడుగుతారని ప్రశిుంచారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య, పార్టీ నాయకులు నలతోటి బాబూరావు, పి.కొండయ్య, జి.ప్రతాప్‌ పాల్గొన్నారు.