ప్రజాశక్తి-బొబ్బిలి : బేబినాయన అరెస్టు దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శి ఎస్.గోపాలం అన్నారు. సిఐటియు కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించినప్పటికి పాదయాత్రకు సిద్ధమైన బేబినాయనను అడ్డుకుని అన్యాయంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన పాదయాత్ర అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని కోరారు. బేబినాయన అరెస్టును సీపీఎం ఖండిస్తుందని చెప్పారు.










