- మట్టి వినాయక విగ్రహాలు పంపిణి చేసిన మధర్ థెరిస్సా సేవా సంఘం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మదర్ తెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ లోభాగంగా, చెరువులు, నదులలో ఉన్న నీటి కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో, సోమవారం జరగబోయే వినాయక చవితి పండగకు, కాలుష్యాన్ని వెదజల్లే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలకు బదులు, కాలుష్యం లేకుండా ఉండే మట్టి వినాయకుడు విగ్రహాలను అయ్యన్నపేట జంక్షన్ లో ఉన్న మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ లో, మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ తల్లిదండ్రులకు మరియు అయ్యన్నపేట జంక్షన్ పరిసర ప్రాంత ప్రజలకు సుమారు 300 మట్టి వినాయక విగ్రహాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం మదర్ తెరిసా సేవా సంఘం బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ & అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు త్యాడ వేణుగోపాలం, సంఘ సభ్యులు శ్రీనివాస్, అరుణ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.










