Sep 16,2023 17:28

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ ఎంపీ మరియు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ చేతుల మీదుగా కళాశాల సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వినాయక చవితి అందరూ పర్యావరణ హితంగా చేసుకోవాలని మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసినట్లు  తెలియజేశారు. అలాగే కళాశాలకు చెందిన ఎన్.సి.సి క్యాడేట్స్  గాజులరేగ పుర ప్రజలకు 500 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామ మూర్తి,  వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.