- సిఐటియు మహాసభలో ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
ప్రజాశక్తి-శ్యామల్ చక్రవర్తి నగర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి : ప్రజలపై భారాలను మోపి, వారిని కష్టాల పాల్జేస్తున్న పెట్టుబడిదారీ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యమ్యాయాన్ని నిర్మించడమే లక్ష్యంగా పోరాటాలను నిర్మించాలని అఖిల భారత కిసాన్‌సభ(ఎఐకెఎస్) ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ పేర్కొన్నారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లోని శ్యామల్ చక్రవర్తి నగర్‌లో జరుగుతున్న సిఐటియు 17వ అఖిల భారత మహాసభకు ఆయన హాజరై శుక్రవారం సౌహార్థ సందేశామిచ్చారు. పెట్టుబడిదారీ విధానంలోనే లోపముందని, దానికి సంక్షభాలు తప్పవని తెలిపారు. ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలే దీనికి నిదర్శనమని అన్నారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాటం సాగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇది మూడు వ్యవసాయ నల్ల చట్టాల రద్దు సమయంలో రుజువైందని గుర్తు చేశారు. రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాటంలో దిగితే పాలకులకు పతనం తప్పదనుది చరిత్ర చెబుతును వాస్తవమని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైందని తెలిపారు. నిరుద్యోగం గతంలో ఎనుడూలేనంతగా పెరిగిందని పేర్కొన్నారు. దినసరి కూలీలు రెండునుర లక్షల మంది ఈ ఎనిమిదేళ్లలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. రైతులు 1995 నుంచి ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడితే ఈ ఎనిమిదేళ్లలో లక్ష మంది రైతులు బలవన్మరణం చెందారని తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరడాల్సిన అవసరముందన్నారు. మరోవైపు ఎఫ్‌సిఐ, ట్రాన్స్‌పోర్టు, విద్యుత్, ఫర్టిలైజర్స్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఈ రంగాలు దెబ్బతింటే ఈ ప్రభావం రైతులపైనా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఈ పాలకుల విధానాలకువ్యతిరేకంగా రైతులు, కార్మికులు ఏకమై పోరాటాలకు సిద్ధపడాల్సిన సమయం ఆసనుమైందన్నారు. 'కిసాన్..మజ్దూర్ ఏక్తా' అనుది ఒక నినాదం కాకూడదని, ఇది క్షేత్రస్థాయి వరకు వెళ్లి అందరినీ కదిలించాలని పిలుపునిచ్చారు. అందుకు సిఐటియు జాతీయ మహాసభ వేదికవ్వాలని ఆకాంక్షించారు.
- క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి : ఎ.విజయరాఘవన్
క్షేత్రస్థాయిలోకి ప్రత్యామాుయ విధానాలను తీసుకువెళ్లాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ.విజయరాఘవన్ అన్నారు సౌహార్ధ్రక సందేశమిస్తూ కార్పొరేట్, కమ్యూనల్ ఎజెండాతో ముందుకెళ్తున బిజెపి విధానాలను తిప్పికొట్టాలనాురు. ఐక్యపోరాటాలకుఏప్రిల్ 5వ తేదీన జరిగే ఛలోఢిల్లీ కార్యక్రమం తొలిమెట్టు కావాలనిఆకాంక్షించారు. గామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులే ఎక్కువనీ, వారిమధ్య ఐక్యత లేకపోతే పోరాటాలను ముందుకుతీసుకుపోలేమనిచెప్పారు.
- బిజెపిని ఓడించాలి : విపి సానూ
విధానపరమైన మార్పు కోసం జరుగుతున్న పోరాటాల్లో తామూ పాల్గంటామని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు వీపీ.సానూ చెప్పారు. ఇప్పుడును ప్రమాదకర పరిస్థితుల్లో బిజెపిని ఓడించడం అత్యావశ్యకమని అన్నారు. ఇటలీ తరహాలో ఫాసిస్టు విధానాలను భారతదేశంలో ఆమలు చేసేందుకు మతతత్వ శక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు. రంగు, మతం, ప్రాంతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి బిజెపి రాజకీయ లబ్ధి పొందుతునుదని విమర్శించారు. అందులో భాగంగానే నూతన జాతీయ విద్యావిధానానిు తీసుకొచ్చిందన్నారు. నూతన విద్యావిధానంపై పార్లమెంట్‌లో చర్చకూడా జరగలేదనీ, మరోవైపు దొడ్డిదారిన దానిు మోడీ సర్కారు అమలు చేస్తునుదని విమర్శించారు. లేబర్ కోడ్‌లతో కార్మికవర్గానిు, నూతన వ్యవసాయ చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తునుదని చెప్పారు.










