
ప్రజాశక్తి-కలకడ: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి కొనియాడారు. శుక్రవారం మండలంలోని కదిరాయ చెరువు పంచాయతీలోని చెరువు ముందరపల్లి, కదిరాయ చెరువు, చిన్నగోగుల వారిపల్లి, వడ్డేపల్లి, నడిమివడ్డిపల్లి, బాటవారివడ్డిపల్లి, బొంతలవారిపల్లి తదితర గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం చేపట్టడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ రీతిలో అందుతున్నాయి, ఎంత మంది తీసుకుంటున్నారు, పథకాలు ద్వారా ఎంత మంది లబ్ది పొందుతున్నారు, అన్న విషయాలపై ఆరా తీసినట్టు తెలిపారు.ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతున్నట్లు తెలియజేశారు.అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కావలసిన ధృవీకరణ పత్రాలు కోసం వివిధ రకాల కార్యాలయాలు చుట్టూ తిరగకుండా తమ తమ పరిధిలో ఉన్న సచివాలయాలలోనే ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఏ సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకువస్తే వెనువెంటనే పరిష్కరించేందుకు మీకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు కిషోర్, మండల పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో పరమేశ్వర్ రెడ్డి, ఎస్సై తిప్పేస్వామి, ఈవో అండ్ పి ఆర్ డి లతీఫ్ ఖాన్, విఆర్వో రామకృష్ణ ,సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.