ప్రజాశక్తి-పీలేరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథ యాత్ర' ను విజయవంతం చేద్దామని పీలేరు నియోజకవర్గం బాధ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఈ మేరకు పీలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. పీలేరు నియోజకవర్గంలో 10వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు వాల్మీకిపురంలోని సబ్ జైల్ సమీపం నుంచి ఈ రథయాత్ర ప్రారంభమై వాల్మీకిపురం బస్టాండు, తరిగొండ మీదగా గుర్రంకొండ చేరుకుని, అక్కడి మధు ఫంక్షన్ హాల్ లో భోజన విరామం తర్వాత సాయంత్రం యల్లుట్లలోని విడిది కేంద్రం వద్ద జరిగే రచ్చబండలో భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్రను ఉద్దేశించి ప్రసంగం ఉంటుందని చెప్పారు. కావున రాష్ట్ర కమిటీ, దాని అనుబంధ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల, గ్రామ అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులందరూ పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చెయాలని కోరారు.










