Aug 29,2023 12:04

శాక్రమెంటో :  కుల వివక్ష వ్యతిరేక బిల్లుని కాలిఫోర్నియా అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఇది కుల వివక్షను ఎదుర్కోవడంతో పాటు రాష్ట్రంలో అణగారిన వర్గాల రక్షణను బలోపేతం చేసేందుకు యత్నిస్తోందని పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా రూపొందించడానికి గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ సంతకం చేయాల్సి వుంటుంది. ఈ బిల్లు చట్టంగా రూపొందినట్లైతే.. అమెరికాలో కులాన్ని రక్షిత కేటగిరీలో నిలిపిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా కానుంది.
ఈ బిల్లును మొట్టమొదట రాష్ట్ర సెనెటర్‌ ఐషా వహాబ్‌ ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక కుల, పౌర హక్కుల కార్యకర్తలు, సంస్థలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఎస్‌బి 403 (కుల వివక్ష వ్యతిరేక బిల్లు)కి మద్దతుగా ఓటు వేసిన అసెంబ్లీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ బిల్లుతో దీర్ఘకాలం నుండి కొనసాగుతున్న వివక్ష నుండి ప్రజలను రక్షిస్తాము '' అని వహాబ్‌ ట్వీట్‌ చేశారు.