కావాల్సిన పదార్థాలు : పాలు - కప్పు, గుడ్డు సొనలు - రెండు, చక్కెర- పావుకప్పు, వెన్న - అరకప్పు, పుదీనాపొడి - టేబుల్ స్పూన్, చాక్లెట్ చిప్స్- ముప్పావు కప్పు.
తయారుచేసే విధానం :
ముందుగా పాలు వేడిగా కాచి గది ఉష్ణోగ్రతలో చల్లబరచాలి.
ఒక గిన్నెలో గుడ్డు సొనలు గిలకొట్టాలి.
చక్కెర, పుదీనా పొడిని బాగా కలపాలి. అందులో సగం పాలల్లో వేసి కలపాలి. తర్వాత దానిని మిల్క్‌పాన్‌కు మార్చుకొని తక్కువ మంటమీద వేడి చేయాలి. కొద్దిగా చిక్కపడే వరకూ తిప్పుతూ ఉండాలి.
ఈ మిశ్రమాన్ని వడకట్టి, గది ఉష్ణోగ్రతలో చల్లబరచాలి. అప్పుడప్పుడూ తిప్పుతూ ఉండాలి. తర్వాత గిన్నెలోకి తీసుకుని రెండు గంటలు ఫ్రీజర్‌లో ఉంచాలి.
తర్వాత మరో రెండు గంటలు గట్టిగా అయ్యేవరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి.