Nov 27,2022 12:28

మట్టెవాడ (వరంగల్‌) : చాక్లెట్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకెళితే ... రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకు తెరువు కోసం వరంగల్‌కు వచ్చి డాల్ఫిన్‌ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముగ్గురు చిన్నారులు స్థానిక శారద పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్నారు. ఇటీవల కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు. వీరిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది తండ్రికి సమాచారం అందించి సందీప్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మఅతి చెందాడు. బాలుడి మఅతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.