Sep 19,2023 13:28
  • సిరిమాను సమయం ప్రకారం తిరిగే విధంగా చూడాలి
  • దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూడాలి
  • పైడితల్లి అమ్మవారి పండగ ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమను జాతర, విజయనగరం ఉత్సవాలుపై అధికారులు సన్నద్ధం కావాలని,వైభవంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ,పైడితల్లి అమ్మవారి పండగ కు దర్సనం చేసుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని,గత ఏడాది మాదిరిగా ఆలస్యం కాకుండా సమయం ప్రకారం సిరిమాను తిరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో  రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకురి రాఘరాజు, జిల్లా కలక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్, నగర మేయర్ విజయలక్ష్మి, జిల్లా అధికారులుతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి పండగతో పాటు విజయనగరం ఉత్సవాలకి సిద్ధం కావాలన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే పండగ, విజయనగరం ఉత్సవాలు విజయవంతంగా జరిగే విధంగా అధికార యంత్రాంగం సిద్దం కావాలన్నారు. ఉత్సవాలు నిర్వహణపై స్వచ్ఛంద సంస్థలు, వివిధ రకాల సంస్థలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అంత కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. పైడితల్లి అమ్మవారి దర్శనానికి వచ్చేభక్తులు కి ఇబ్బంది లేకుండా దర్శనం జరగాలే చర్యలు తీసుకోవాలని సూచించారు.
సిరిమను జాతర ఈ సారి ఇంకా ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, గత ఏడాది కొంత ఆలస్యం జరిగింది, ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, అందుకు హుకుం పేటలో ఉన్న పైడిమాంబ కమిటీ సభ్యుల తో సమావేశం పెట్టాలని ఆర్డీవోను, పైదిమాంబా.దేవస్థానం ఎసినీ ఆదేశించారు.అధికారులు అందరూ సొంత పండుగగా భవించి కష్టపడి జాతర నిర్వహించాలన్నారు. అనుకున్న సమయానికే సిరిమను మొదలైయ్యేట్టు చూడాలన్నారు. ఉత్సవాలపై మరోసారి సమావేశం అయ్యి నిర్ణయం తీసుకుందామన్నారు. డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గత ఏడాది.మాదిరిగానే వి ఐ పీ పాస్ లు పెట్టొద్దని, సామాన్య భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని విధంగా చూడాలన్నది మా ఉద్దేశ్యం అన్నారు. వి ఐ పీ లు ఎవరు వస్తరనేది ముందస్తుగా జాబితా తయారు చేసుకుంటే దానికి అనుగుణంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భక్తులు దర్సనం చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఎటువంటి విమర్శలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.