Dec 11,2022 21:52

పరవూరు : ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు, పూతకులం నిధి బ్యాంక్‌ పాలక మండలి సభ్యుడు పూతకులం చెకంఠజికం అనూప్‌ నివాసంలో ఓ మహిళ శనివారం మధ్యాహుం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం కలైకోడ్‌కు చెందిన ఓ మహిళ శనివారం అనూప్‌ ఇంటికి చేరుకుంది. అనూప్‌ తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనూప్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం అనూప్‌ ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఆ మహిళ ఉరి వేసుకుని కనిపించింది. ఘటన జరిగిన సమయంలో అనూప్‌ సోదరి ఇంట్లోనే ఉంది. యువతి కనిపించకపోవడంతో అక్కడికి ఆమె బంధువులు చేరుకోగా, తలుపులు తీయలేదు. కిటికీలోంచి చూసేసరికి గదిలో ఉరికి వేలాడుతూ మహిళ కనిపించింది. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి ఆమెను రక్షించారు. కొల్లం గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో బాధిత మహిళ చికిత్స పొందుతున్నారు.