Sep 27,2023 11:24

ప్రజాశక్తి-కలకడ : విద్యార్థులతో స్నేహబంధం ఎదగాలని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు.బుధవారం మండలంలోని నడిమిచర్ల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించినట్లు తెలిపారు.వసతి గృహంలోని విద్యార్థులు తమ తల్లిదండ్రులను వదిలి ఇక్కడ ఉన్నారు.కాబట్టి వారిని కన్న బిడ్డల వలె చూసుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.వారికి మెనూ ప్రకారం భోజనాలు వడ్డించాలని వారికి కాస్మోటిక్ చార్జీలు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని క్రమశిక్షణ కలిగేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయపు భోజనం చేసినట్లు తెలిపారు.అనంతరం విద్యార్థుల హాజరు రికార్డులు పరిశీలించి వ్యక్తం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డెన్ రమేష్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.