Jun 29,2023 14:51
  • ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన నమాజులు పాల్గొన్న రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి

ప్రజాశక్తి - రాజంపేట రూరల్ : మహమ్మదీయుల ముఖ్య పండుగలో బక్రీద్ పండుగ ఒకటని దైవారాధ విశిష్టతను ప్రచారం చేసే నిమిత్తం ఒక మహనీయుడు చేసిన నిరుపమాన త్యాగశీలతకు ప్రతీకగా ముస్లిం సోదరులు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారని రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం రాజంపేటలోని మదని మసీద్ రాజంపేట శివారులోని ఈద్గానందు ముస్లిమ్స్ తో కలిసి ప్రత్యేక ప్రార్థన నమాజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ముస్లిం పంచ సూత్రాలను తప్పకుండా ఆచరిస్తూ అల్లాపై విశ్వాసంతో ముస్లిములు ప్రతిరోజూ ఐదు సార్లు నమాజ్ చేస్తారని చెప్పారు బక్రీద్ రోజున ప్రపంచంలోనే ముస్లింలంతా ఒకేసారి ప్రార్థన నిర్వహిస్తారని అందుకే ఈ పండుగని అతి పవిత్రంగా జరుపుకుంటారన్నారు మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను సోదర భావాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర రోడ్డు శాఖ డైరెక్టర్ గుల్జార్ భాష మాట్లాడుతూ రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అన్న మాట ప్రకారం రాజంపేట పట్టణ ఈద్గా మసీదు కొరకు ఐదు ఎకరాల స్థలము మరియు ప్రభుత్వ నిధులతో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసి ముస్లింలకు నమాజ్ ప్రార్థన చేసుకునేందుకు వీలుగా చేశారన్నారు. ముస్లిం సోదరుల తరఫున ఎమ్మెల్యే మేడాకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు రాజంపేట వార్డు కౌన్సిలర్లు ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.