- గుజరాత్‌లో అధికారుల నిర్లక్ష్యం
గాంధీనగర్ : ఒక కేసులో శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చినప్పటికీ.. అందుకు సంబంధించి ఈ-మెయిల్‌లో వచ్చిన ఆర్డరు కాపీని అధికారులు తెరవకపోవడంతో అతను మూడేళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన గుజరాత్ హైకోర్టు నిందితుడికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గుజరాత్‌కు చెందిన చందన్‌జీ ఠాకూర్ (27) ఓ హత్య కేసులో దోషి. దీంతో అతడు జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అయితే, సెప్టెంబర్ 29, 2020న అతడి శిక్షను గుజరాత్ హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రీ జైలు అధికారులకు ఆర్డరు కాపీని ఈ-మెయిల్‌లో పంపించింది. కానీ, జైలు అధికారులు మాత్రం మెయిల్‌లో ఉన్న అటాచ్‌మెంట్‌ను తెరచి చూడలేదు.