- ఒకటో సచివాలయం కన్వీనర్లు చాంద్ బాషా,అంజమ్మలు వెల్లడి
ప్రజాశక్తి - బి.కొత్తకోట : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని బి.కొత్తకోట నగర పంచాయతీ ఒకటో సచివాలయం కన్వీనర్లు గుమ్మడికాయల చాంద్ బాషా, అంజమ్మలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గృహసారథులు, వాలంటీర్లను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇక బి.కొత్తకోట మండల మొట్టమొదటిగా తమ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి మంచిపేరు తీసుకొస్తామన్నారు.ఇందులో భాగంగా నగర పంచాయతీ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు అకౌంట్ ఆఫీసర్ రమాదేవి మరియు ఆర్.ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కిరణ్, ఒకటో సచివాలయం వెల్ఫేర్ మౌలా, మహిళా పోలీసు, వాలంటీర్లు శ్రీనివాసులు, గృహసారథులు తుమ్మ గింజల జనార్ధన్, సచివాలయం స్టాప్ షామీర్, రాంబాబు, సమస్యలపై, సర్టిఫికెట్ల మంజూరుపై ప్రజలకి వివరిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు.










