Jul 01,2023 11:50

ప్రజాశక్తి - బి.కొత్తకోట : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని బి.కొత్తకోట నగర పంచాయతీ నాలుగోవ సచివాలయం కన్వీనర్లు కంచి కళ్యాణ్ కుమార్ రెడ్డి, సిఆర్ చిన్ని కృష్ణ, పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గృహసారథులు, వాలంటీర్లను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇక  బి.కొత్తకోట పట్టణంలోని నాలుగవ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి మంచిపేరు తీసుకొస్తామన్నారు. ఇందులో భాగంగా నగర పంచాయతీ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాలుగవ సచివాలయం వెల్ఫేర్ శ్రీనివాసులు, వి ఆర్ ఓ హైదర్, వాలంటీర్లు ఎంఎల్ఓ ఇంతియాజ్, మహిళా పోలీసు, వాలంటీర్లు మనోజ్, గృహసారథులు వాణి, సచివాలయం సిబ్బంది సెమీర్,  హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కంచి సురేందర్ రెడ్డి, వైసిపి నాయకులు జనుపువారిపల్లి శ్రీనివాసులు, మధుకర్ రెడ్డి, సమస్యలపై, సర్టిఫికెట్ల మంజూరుపై ప్రజలకి వివరిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు.