
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఆదివారం కడప నగరంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ నందు టైక్వాండో కడప జిల్లా కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా చైర్మన్ రవిశంకర్ రాజు, వైస్ చైర్మన్ బి.సునీల్,ఉపాధ్యక్షులు దామోదర్ రాజు, పర్యవేక్షకులు కొన్నిపాటి వెంకటేష్ ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కడప, అన్నమయ్య జిల్లాల టైక్వాండో పోటీలలో జి ఎం సి లోని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు పతకాల పంట పండించారని మాస్టర్ బి.సునీల్ తెలియజేశారు. 20 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొనగా 20 మంది పతకాలు సాధించినట్లు తెలిపారు. ఇందులో 8 మంది స్వర్ణం, 8 మంది రజతం, నలుగురు కాంస్య పతకాలు సాధించారని అన్నారు. గెలుపొందిన వారు ఈ నెల 24వ తేదీన రైల్వేకోడూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు సోమవారం జిఎంసీలోని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నందు పతకాలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ, కోచ్ లు చంద్రశేఖర్, నాగరాజ, గంగారాం, తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొన్నారు.