ప్రజాశక్తి-కలకడ : విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యను అభ్యసించాలని ఎస్సై తిప్పేస్వామి తెలిపారు. గురువారం మండలంలోని స్థానిక మాటవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు నందు విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థి దశ ఉన్నతమైనదని దానిని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగించుకొని విద్యను అభ్యసించాలని తెలియజేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉండి ఉపాధ్యాయుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థి దశ చాలా కీలకమైనదని తిరిగి విద్యార్థి దశ రాదని తెలియజేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిస కాకుండా విద్యాబుద్ధులు నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత ఆశయాలు సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని సూచించామన్నారు. ప్రతి విద్యార్థి మంచి స్నేహాన్ని కలిగి ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండి మెలగాల అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతి, ఏఎస్ఐ బాలకృష్ణ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, పోలీసు సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.










