
- ఆటో డ్రైవర్లకు ఈ చలనాలు రద్దు చేయాలి
- అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు విజయవంతం చేయండి
ప్రజాశక్తి-బి.కొత్తకోట : రాష్ట్ర వ్యాపితంగా ఆటో కార్మికులకు ఇబ్బంది కలిగించే పోలీసు ఈ-చలానాలు రద్దు చేసి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శు సలీం భాష వేణుగోపాల్ రెడ్డిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బి.కొత్తకోటలో ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అతిథిగా ఏఐటీయూసీ తంబళ్ళపల్లి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి ఎస్.సలీం భాషా బి వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సలీం భాష వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరుతూ చేపడతామన్న ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత ఉద్యమాలపై ఉక్కు పాదం మోపడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో అండ్ మోటార్ వాహన డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని భారీగా పెనాల్టీలు పెంచే జీవో నెంబర్ 21, 31 రద్దు చేయాలని ఆటో మోటార్ వాహనాలపై ఉన్న పెండింగ్ లో ఉన్న పోలీస్ ఈ చలనాలు రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పేరుతో సంవత్సరానికి 10 వేల రూపాయలు ఇస్తూ మరో వైపు ఇన్సూరెన్స్, ఎఫ్. సి. పోలీసు ఈ చలానాలు పేరుతో ట్యాక్స్ పేరుతో ఆటో డ్రైవర్ల నుంచి విపరీతంగా ధరలు పెంచి దోపిడీ చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఆటో నడుపుతున్న ప్రతి ఆటో డ్రైవర్ కు వాహనమిత్ర పథకం వర్తించే విధంగా చూడాలని, ఆటోలు నిలుపుకోవడానికి పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈనెల 18న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనలో ఆటో వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గణేష్ కుమార్, భాస్కర్ జయరాం, రామన్న శ్రీనివాసులు, వినోద్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.