Feb 08,2023 15:24

గువహటి   :   మేఘాలయ- నాగాలాండ్‌లలో క్రిస్టియన్‌లుగా మారిన గిరిజనులను ఎస్‌టి జాబితా నుండి తొలగించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన జనజాతి ధర్మ-సంస్కృతి సురక్షా మంచ్‌ (జెడిఎస్‌ఎస్‌ఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. క్రైస్తవ, ఇస్లాం వంటి విదేశీ మతాలను స్వీకరించిన ప్రజలు రెట్టింపు ప్రయోజనాలను పొందుతున్నారని.. ఎస్‌టిలకు చెందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలు, ప్రమోషన్‌లను కొల్లగొడుతున్నారని జెడిఎస్‌ఎస్‌ఎం కోకన్వీనర్‌ బినుద్‌ కుంబంగ్‌ పేర్కొన్నారు. మతమార్పిడి ద్వారా క్రిస్టియన్‌లుగా మారిన గిరిజనులు ఎస్‌టి రిజర్వేషన్‌ కింద లబ్థి పొందుతున్నారని గతంలో కాంగ్రెస్‌ ఎంపి కార్తీక్‌ ఓరాన్‌ లేవనెత్తారు. దీంతో సమస్యను పరిశీలించేందుకు 1968లో సంయుక్త పార్లమెంటరీ కమిటీని కూడా నియమించింది. కాగా, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఈనెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.