Jul 06,2023 12:38

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: మూడవ వార్డు టీడీపీ ఇంచార్జి, కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిశాల మాజీ అధ్యక్షులు పాల ప్రకాష్ మరియు కృష్ణ డ్రెస్సెస్ కృష్ణ మోహన్ ల ఆహ్వానం మేరకు గురువారం టీడీపీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆర్య వైశ్యులతో తేనీటి విందులో పాల్గొన్నారు. ఆర్య వైశ్య పెద్దలు చమర్తిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా జగన్ రాజు మాట్లాడుతూ వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయం లో ముందుండే ఆర్య వైశ్య సోదరులతో ఆత్మీయ సమావేశం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీనియర్ నాయకులు, మాజీ కల్లుగీత కార్మిక రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, రాజంపేట టీడీపీ సీనియర్ నాయకులు జీవీ సుబ్బరాజు, ఆర్య వైశ్య నాయకులు టీ.మణికంఠ, వి.శ్రీనివాసులు, జి.హరి, ధనుంజయ, మధుసూదన్ రావు, కృష్ణమోహన్, టీ ఎన్ ఎస్ ఎఫ్ పార్లమెంటు అధ్యక్షులు పోలి శివకుమార్, రామాంజనేయులు, ముస్లిం మైనారిటీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మండే కరిముల్లా, సూర్య నారాయన రాజు, పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు వాణి, కేతా రాజశేఖర్, నాగేంద్ర, వెంకటేష్ యాదవ్, సుబ్రహ్మణ్యం, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.