Jul 19,2023 15:46

ప్రజాశక్తి నందలూరు : రీజెన్సీ నలంద విద్యాసంస్ధల చైర్మన్ డా.జి.యన్.నాయుడు అద్వర్యంలో బుధవారం నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న సౌమ్యనాథ సేవ ట్రస్ట్ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిరిగా పాల్గొని అన్నప్రసాదం స్వికరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాసంస్ధల కోఅర్డినేటర్ బి.వి.నరసయ్య, ప్రదానోపాద్యాయుడు డి.మురళి, విద్యాసంస్ధల మేనేజర్ జి.చందు, పాల్గొన్నారు.