- ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగనవాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు బగ్నం చేసే పనిలో పడ్డారు. 25 తేదీ సోమవారం తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు,సి ఐ టి యు నాయకులను వెళ్లనీయకుండా పోలీసులు ఆదివారం ఉదయం నుంచి ఇళ్లకు వెళ్లి ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలో సిఐటియు నాయకులు బి.సుధారాణి ఇంటికి వెళ్ళి అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ కి తరలించారు.జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ను అరెస్టులు చేస్తూ స్టేషన్ కి తరలించే పనిలో పడ్డారు. సమస్యలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమని సుధారాణి అన్నారు. వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ లు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.










