ప్రముఖ కవి, విమర్శకులు, ప్రతిష్టాత్మక ఉమ్మడి శెట్టి అవార్డు వ్యవస్థాపకులైన డా.రాధేయకి నిజామాబాద్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి అమృతలత జీవన సాఫల్య పురస్కారం -2023 ప్రకటించారు. మార్చి అయిదవ తేదీన ప్రముఖుల సమక్షంలో నిజామాబాద్ లోని శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో రాధేయకి పురస్కార ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. గత యాభై ఏళ్లుగా, కవిత్వం రాస్తూ, ముప్పై అయిదేళ్లుగా ఉత్తమ కవిత్వానికి ఉమ్మడిశెట్టి అవార్డులను ప్రదానం చేస్తున్న రాధేయని అమృత జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు సంస్థ ప్రకటించింది. డా. రాధేయకి ఈ పురస్కారం ప్రకటించడం పట్ల, అనంత సాహితీవేత్తలు మరియు ఉభయ రాష్ట్రాల కవులు, కవితాభిమానులు హర్షం ప్రకటిస్తూ అభినందనలు తెలియజేశారు.










