Jun 28,2023 12:34

ప్రజాశక్తి - బి.కొత్తకోట : సమస్యల పరిష్కారమే ఎజెండాగా తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో శంకరయ్య ప్రారంభించారు. మండల అధ్యక్షులు ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ,జడ్పిటిసి రామచంద్రయ్య యాదవ్,సభా వేదికపై ఆహ్వానించారు. మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నట్లు మండల ఎంపిపి లక్ష్మీనరసమ్మ తెలిపారు. అదేవిధంగా జడ్పిటిసి రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రతి సచివాలయంలోనూ ఇంజనీర్లు కానీ ఇతర అధికారులు గాని వాలంటీర్లు కానీ పనితీరు సరిలేదని  ఎప్పుడు వెళ్లి పరిశీలించిన ఫీల్డ్ మీద అంటారు. ఆ ఫీల్డ్ ఎక్కడికి వెళ్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సెక్రటరీలు జాగ్రత్త తీసుకోవాలని ఎంతో ప్రతిష్టంగా నిర్వహించే సచివాలయాలు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని తెలిపారు. అలాగే తహసిల్దార్ ధనుంజయులు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో పనులు చేస్తున్నారని కొనియాడారు. అలాగే ఎంపీడీవో శంకరయ్య మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే మండల సర్వసభ వేశానికి వచ్చినప్పుడు ప్రతి శాఖకు చెందిన వాళ్లు మూడు రోజులు ముందే నివేదిక సమర్పించాలని తెలిపారు, అలాగే మూడు సర్వసభ సమావేశానికి హాజరుకాని ఎంపీటీసీలుపై రాజ్యాంగబద్ధంగా వారి పదవి నుంచి తొలగిస్తామని వెల్లడించారు. కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే వెలుగు ఏపీఎం మాట్లాడుతూ గృహ నిర్మాణాలు నిర్మించుకున్న వారికి పునాదులు వేయడానికి మహిళ గ్రూపులో ఉన్న మహిళలకు సంఘమిత్ర ధారా ముప్పై ఐదు వేలు ఆర్థిక సహాయం రూపాయి వడ్డీ ఇస్తామని తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ ఏఈ గిరిధర్ మాట్లాడుతూ మండలంలో రెండు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు అనుమతులు వచ్చాయని అందులో భాగంగా మండలంలోని రెండు విద్యుత్ సబ్ స్టేషన్లకు నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.అలాగే విద్యుత్ శాఖ ఏఈ గిరిధర్ మాట్లాడుతూ బి.కొత్తకోట మండలంలో ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం విదితమే.  ఇప్పుడు ప్రభుత్వం 50 యూనిట్ల నుంచి 200 యూనిట్లు వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తుంది 200 యూనిట్లు దాటిన వారికి అందులో సగభాగం మొత్తం కట్టించుకోవడం జరుగుతుందని.ఈ సమావేశం ఉపాధి హామీ అధికారి మంజుల, మండల విద్యాశాఖ అధికారులు రెడ్డి శేఖర్, భువనేశ్వర చారి, డిప్యూటీ తాసిల్దార్ అన్సరి, ఆర్ఐ బాలాజీ, హౌసింగ్ ఏఈ లావణ్య, ఎంపీటీసీలు సుబ్బయ్య నాయుడు, రామ సుబ్బారెడ్డి, సర్పంచులు వేమలేటి కోటి రవి, గుడిపల్లి సర్పంచ్ రఘు, బడికాయలపల్లి  సర్పంచ్ ఆదెప్ప గౌడ్. ఎంపీడీవో ఏవో థామస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.