Sep 16,2023 16:52

ప్రజాశక్తి-నందలూరు : అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఏపీ కాస్ట్) డిస్ట్రిక్ట్  కోఆర్డినేటర్  పి. రవి శంకర్ రెడ్డి  అద్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వ్యాస రచన, డ్రాయింగ్, వకృత్వ పోటీలలో గొబ్బిళ్ళ అక్షర  స్కూల్ స్టూడెంట్స్ ముగ్గురు బహుమతులను  గెలుచుకొని తమ సత్తా చాటారని గొబ్బిళ్ళ అక్షర స్కూల్  చైర్మన్ గొబ్బిళ్ళ త్రినాథ్, కరెస్పాండంట్ గొబ్బిళ్ళ శ్రీనాథ్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస రచన విభాగంలో ఎస్.ఆర్షియా, తస్లీమ మొదటి బహుమతి, వకృత్వ పోటీల విభాగం లో ఎస్.సిద్దిక ద్వితీయ బహుమతి, లాస్య ప్రియ డ్రాయింగ్ పోటీలలో ద్వితీయ బహుమతి సాధించారని అన్నారు. బహుమతులు సాధించిన విజేతలను అధ్యాపక బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో వర ప్రసాద్ , అమర్నాథ్, కుసుమ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.