Apr 03,2023 22:30
  • బడ్జెట్‌లో మత్స్య పరిశ్రమకు అరకొర కేటాయింపు
  • ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌ పార్లమెంట్‌ మార్చ్‌లో తపన్‌ సేన్‌, హేమలత

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ పాలనలో దేశంలోని మత్స్యకారులు, మత్స్య కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని సిఐటియు అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె హేమలత, తపన్‌ సేన్‌ విమర్శించారు. కార్పొరేట్లకు సముద్ర తీర ప్రాంతానిు తాకట్టు పెడుతోందని, మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభుత్వం దెబ్బకొడుతోందని ఆగ్రహించారు. సోమవారం నాడు జంతర్‌ మంతర్‌ వద్ద అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌) ఆధ్వర్యాన పార్లమెంటు మార్చ్‌ జరిగింది. సిపిఎం ఎంపిలు వి శివదాసన్‌, ఎఎ రహీమ్‌ సంఘీభావం తెలిపారు. సంఘం జాతీయ అధ్యక్షులు దేబ్‌ శశి బర్మన్‌ అధ్యక్షతన జరిగిన ధరాును తపన్‌ సేన్‌ ప్రారంభించారు. దేశంలో గత ఎనిమిదేళ్ల నుంచి మోడీ ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో మత్స్య పరిశ్రమ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మత్స్య వృత్తిపై ఆధారపడిన కోట్లాదిమంది జీవితాలను కేంద్రం అగమ్యగోచరంగా మార్చిందన్నారు. కె హేమలత మాట్లాడుతూ.. చేపలను ఎగుమతులు చేసేందుకు దేశంలోని మత్స్యకారులను అనుమతించడం లేదని, సముద్ర ప్రాంతానిు వివిధ వ్యాపారాల (హోటళ్లు, రెస్టారెంట్లు, అతిథి గృహాలు వంటి వ్యాపార సంబంధిత వ్యవహారాలు)కు అనుమతిస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జైళ్లలో మన దేశ మత్స్యకారులు మగ్గుతున్నారని, కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మత్స్య సహకార సంఘాలు మాఫియా చేతుల్లో ఉన్నాయని, వారు మత్స్యకారుల నుంచి అధిక రుసుం వసూలు చేస్తునాురనివిమర్శించారు. చేపలు శుద్ధి చేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వటం లేదని, కానీ కార్పొరేట్లు లాభాలు పొందుతున్నారని తెలిపారు. మత్స్యకారులు, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, పెన్షన్‌, ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.
ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ విధానాలు మత్స్యకారులపై తీవ్ర ప్రభావం చూపుతునాుయనివిమర్శించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో విదేశాల నుంచి చేపలు దిగుమతికి సంతకాలు చేశారని, ఇది దేశంలోని మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోందని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు అన్ని రంగాలనూ లూటీ చేస్తున్నారని, దీనికి మోడీ ప్రభుత్వం మద్దతుగా ఉందని అన్నారు. ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌ ప్రధాన కార్యదర్శి పుల్లివెల స్టాన్లీ మాట్లాడుతూ.. మత్స్యకారులు, మత్స్య కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తును నయా ఉదారవాద విధానాల వల్ల మత్స్యకారులు, చేపల విక్రయదారులు, చేపల ప్రాసెసింగ్‌ కార్మికులు తదితర అనిు వర్గాల వారు నానా అవస్థలు పడుతున్నారని, పేదరికం, అప్పులు, కష్టాల్లో జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌ కోశాధికారి జి మమత, కేరళ మత్స్య ఫెడ్‌ ఛైర్మన్‌ టి మనోహరన్‌, జాతీయ ఉపాధ్యక్షులు మహఫజ్‌ రహమాన్‌, జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సిహెచ్‌ రమణి, వై శ్రీనివాస్‌, ఎస్‌ కళావతి, పి నారాయణ, సిహెచ్‌ రమేష్‌ తదితరులు పాల్గన్నారు.

aiffwf-members-met-union-minister
  • కేంద్ర మంత్రికి వినతి

మత్స్యకారుల సమస్యలపై కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలాను ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌ బృందం కలిసి ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రానిు సమర్పించింది. మత్స్యకారులకు కిరోసిన్‌, డీజిల్‌ను సబ్సిడీపై అందించాలని, చేపల వేటకు సబ్సిడీల ఉపసంహరణపై డబ్ల్యుటిఒ ఒప్పందానిు రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. మెరైన్‌ ఫిషరీస్‌ బిల్లు ముసాయిదా, బ్లూ ఎకానమీ పాలసీని ఖరారు చేసే ముందు మత్స్యకారులు, మత్స్య కార్మికుల ప్రతినిధులతో చర్చించాలని కోరింది. చేపల ప్రాసెసింగ్‌ కార్మికులు, అనుబంధ కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, పెన్షన్‌, అనిు కార్మిక చట్టాలనూ సమర్థవంతంగా అమలు చేయాలనిడిమాండ్‌ చేసింది. సముద్ర తీరం, మడ అడవులు, తీర ప్రాంతాలను రక్షించడానికి కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సిఆర్‌జెడ్‌) నియమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, తీరప్రాంతాల్లో నివసించేవారు తమ ఇళ్లను ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతించాలని కోరింది. మత్స్యకారుల సహకార సంఘాలకు నామమాత్రపు ధరలకు ఫిషింగ్‌ కోసం కేంద్ర ప్రభుత్వ నీటి వనరులను అందించాలని డిమాండ్‌ చేసింది.

  • దుబ్బుల కొలువు కళాకారుల వృత్తిని గుర్తించండి

ఈ ధరాులో దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాటూరి దేవేందర్‌, జునగరి దుర్గయ్య ఆధ్వర్యంలో వందలాది మంది దుబ్బుల కొలుపు కళాకారులు తమ కళా ప్రదర్శన చేశారు. జాతీయ స్థాయిలో దుబ్బుల కొలుపు కళాకారుల వృత్తిని గుర్తించి, జాతీయ గెజిట్‌లోకి చేర్చాలనిడిమాండ్‌ చేశారు.