ప్రజాశక్తి-ఉంగుటూరు (ఏలూరు) : మండలం దొంతవరంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో సుమారు రెండు అడుగుల వరకు నీరు ముంచెత్తింది. గోదావరి జలాలను కోనాల కాలవ నుంచి రాచూరు పంట కాలువ మీదగా చెరువుల కోసం నీటిని వదులుతున్నారు. ఈ కారణంగా పంట కాలవ గట్లను తాకుతూ నీరు ప్రవహిస్తూ పక్కనే ఉన్న చేలల్లోకి నేరుగా చేరింది. ఈ కారణంగా వరి కోతలు చేపట్టలేక పంట నష్టంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాచురూ, సీతారాంపురం, తదితర గ్రామాలకు చేపల చెరువుల కోసం నీటి ప్రవాహాన్ని పెంచేశారని, తమకు నీరు అవసరం లేదని వరి సాగుదారులు వాపోతున్నారు.










