Nov 15,2022 15:54

ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌) : జిల్లాలోని రెడ్డిగూడెం మండలం, రంగాపురం గ్రామ పంచాయతీలో గల అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థునుల యొక్క ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేశారు. అలాగే బాలికలకు అందజేస్తున్న ఆహారాన్ని, మెను ప్రక్రియను తెలుసుకున్నారు. మెనూ పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శంకరావు, ఎంపిపి రామినేని దేవిప్రవణ్యవీరస్వామినాయుడు, రంగాపురం గ్రామ సర్పంచి సునీల, ఎంపిడిఓ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ గంగాధర్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి డాక్టర్‌ వి.రవి కుమార్‌, నాయకులు రామినేని వీరస్వామినాయడు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.