Jun 05,2023 20:37

బెంగళూరు : భారత్‌లో తన సేవలను విస్తరిస్తున్నట్లు విమానయాన సంస్థ వర్జిన్‌ అట్లాంటిక్‌ వెల్లడించింది. లండన్‌ హీత్రూ నుండి బెంగళూరుకు రోజువారీ విమానయానంతో వినియోగదారులకు గతంలో కంటే ఎక్కువ ఎంపికలను అందిస్తోన్నట్లు తెలిపింది. 2019 నుండి వర్జిన్‌ అట్లాంటిక్‌ భారత్‌లో తమ సామర్థ్యాన్ని 250 శాతం పెంచినట్లు పేర్కొంది. బ్రిటన్‌, భారత్‌ మధ్య ప్రతీ ఏడాది దాదాపు 500,000 సీట్లను అందిస్తూ.. దేశం పట్ల తమ నిబద్ధతను చాటుతున్నట్లు పేర్కొంది. వర్జిన్‌ అట్లాంటిక్‌ 2023 అక్టోబర్‌ 28వ తేదీ నుండి లండన్‌ హీత్రూ నుండి దుబారు వరకు సీజనల్‌ శీతాకాల సేవలను, 2024 జూన్‌ 3వ తేదీ నుండి మాంచెస్టర్‌ నుండి లాస్‌ వెగాస్‌ వరకు సీజనల్‌ సమ్మర్‌ సర్వీస్‌, 2022 మే 13వ తేదీ నుండి సావో పాలోకు రోజువారీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.