నెవాడా : ఎయిర్ రేసింగ్‌లో రెండు విమానాలు ఢీకొని ఇద్దరు పైలట్లు మృతి చెందిన ఘటన అమెరికాలోని నెవాడాలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రెనో ఎయిర్ రేసింగ్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు విమానాలు ఢీకొన్నట్టు తెలిపింది. ఈఘటనలో అక్కడిక్కడే ఇద్దరు పైలట్లు మృతిచెందినట్లు, మరెవరూ గాయపడలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. విమానాలు ల్యాండవుతున్న సమయంలో ఢకొీన్న దశ్యాలు కెమెరాకు చిక్కాయి.