Sep 14,2023 09:40

ఢిల్లీ : ఢిల్లీ నుంచి అడీస్‌ అబాబా వెళ్తున్న ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం కాక్‌పిట్‌లో పొగలు రావడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కాక్‌పిట్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్‌ ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ఆ సమయంలో విమానంలో 240 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.