Jul 29,2023 15:38

సాక్షి సింగ్‌ ధోని నిర్మాతగా 'LGM' సినిమా రూపొందింది. హరీశ్‌ కల్యాణ్‌ - ఇవాన జంటగా రూపొందిన ఈ సినిమాకి, రమేశ్‌ తమిళమణి దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఆగస్టు 4వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'లలనా .. లలనా ప్రేమ ఒళ్లో పడ్డానా' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సినిమాకి సంగీతాన్ని కూడా రమేశ్‌ తమిళమణి అందించారు. ఈ మూవీలో నదియా .. యోగిబాబు .. దీపా శంకర్‌ ముఖ్యమైన పాత్రలను పోషించారు.