
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రో' చిత్రం నుండి తాజాగా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 28న విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. తాజాగా విడుదలచేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకి లిరిక్స్ అందించారు. థమన్ సంగీత సారథ్యంలో చాలామంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారని సమాచారం. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ లేడీ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.