Oct 13,2023 15:20

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌- పాలస్తీనాల మధ్య గత కొన్నిరోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌ సైనికులు వీధుల్లో.. ఇళ్లలోకి చొరబడి ఏవిధంగా కాల్పులు జరుపుతున్నారో తాజాగా ఓ వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) శుక్రవారం విడుదల చేసింది. అలాగే ఈ వీడియోకు జతగా.. 250 మంది బందీలను రక్షించినట్లు.. 60 మంది హమాస్‌ మిలిటెంట్లతోపాటు దక్షిణ నావికాదళ కమాండర్‌ మహమ్మద్‌ అబూ అలీతో సహా మరో 26 మంది ఇజ్రాయెల్‌ సైన్యం పట్టుకుందని ఐడిఎఫ్‌ పేర్కొంది.