గాజా : గత కొన్నాళ్లుగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలో ఈ యుద్ధం తర్వాత.. ఇప్పుడు ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ల గ్రూపు మెరుపు దాడి చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఐదు వేలకు పైగా రాకెట్లతో హమాస్ దాడికి పాల్పడింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ అట్టుడుకుతోంది. రాకెట్ దాడి అనంతరం హమాస్ గ్రూప్ వరుస దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు వాహనాల్లో తిరుగుతూ.. కనబడ్డ పౌరుల్ని తుపాకులతో కాల్చి చంపుతున్నారు.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ మిలిటెంట్లు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను అంతర్జాతీయ మానవహక్కుల న్యాయవాది ఆర్సెన్ ఒస్త్రోవ్‌స్కీ షేర్ చేశారు. హమాస్ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో షార్ హనెగెవ్ రీజినల్ కౌన్సిల్ మేయర్ ఓఫిర్ లిబెస్టీన్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ప్రత్యేకించి జెరూసలేంలో ఇజ్రాయెల్ సైనికులను బందీగా చేసుకుని నేలపై లాక్కుంటూ వెళుతున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.
Just surreal! Footage of Palestinian Hamas terrorists who infiltrated into Israel from Gaza, firing at residents in Sderot from an SUV. pic.twitter.com/ffUO5XwG1I
— Arsen Ostrovsky (@Ostrov_A) October 7, 2023