వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం బుధవారం ఇటలీలో వైభవంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మెగా, అల్లు కుటుంబాల సభ్యులు ఇటలీలో ఈ పెళ్లి వేడుకకు హాజరై సందడి చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈనెల 5న మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా రిసెప్షన్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.