Nov 08,2022 16:19

ప్రజాశక్తి-మైలవరం(ఎన్టీఆర్‌ జిల్లా) : జి కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన వివోఏ ప్రమీలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ డిమాండ్‌ చేశారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివోఏ ప్రమీలను సిపిఎం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా డివి.కృష్ణ మాట్లాడుతూ.. ప్రమీలపై అవినీతి ఆరోపణ అనంతరం ఉన్నతాధికారులు విధుల్లో కొనసాగాలని నిర్ణయించిన ఇప్పటివరకు ఆమెను విధులోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే ప్రమీలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆమెపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దళిత మహిళపై ఈ రకమైన దాడులకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులకు ఆయన మిత్రులకు తగదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి వారిపై తక్షణ చర్యలు చేపట్టాలని లేని పక్షంలో సిపిఎం ఆందోళనకు పిలుపునిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పీవీ ఆంజనేయులు, రాహుల్‌ రమేష్‌, చాట్ల సుధాకర్‌, రావుల.సుబ్బారావు, ఎస్‌.ఇసాక్‌ తదితరులు పాల్గొన్నారు.