ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పలు వాయిదాల తర్వాత ఈ చిత్రం తేదీని ప్రకటించారు నిర్మాతలు. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. నవంబర్ చివర్లో మరో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక కాగా, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.










