ప్రజాశక్తి-తిరుపతి: తిరుమలలో బ్రహ్మౌత్సవాల ఏర్పాట్లపై టిటిడి ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసారి బ్రహ్మౌత్సవాలకు చాలా విశిష్టత ఉందని.. ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మౌత్సవాలు ఒకేసారి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు సార్లు జరిగే బ్రహ్మౌత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మౌత్సవాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని.. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.










