ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్) : ఉమ్మడి కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా పని చేసిన ఎస్వి సారథి రావు 10వ వర్ధంతిని గురువారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు. సూర్యనారాయణ మాట్లాడుతూ నేటి నేటి తరం వాళ్లు సారధి రావు ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి. ఆంజనేయులు మాట్లాడుతూ.. భూ పోరాట, రైతాంగ పోరాటాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. మైలవరం ప్రాంతంలో సిపిఎం నాయకులుగా ఆయన సేవలు మరువలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిరెడ్డి.వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు మద్ది. రెడ్డి మాధవరెడ్డి, రావురి.రమేష్, వజ్రాల. వెంకటరెడ్డి, సిహెచ్.సుధాకర్, షేక్.అల్లాబక్షు, ఎస్పీ.మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.










